కావలసినవి:- వెల్లులి రేకులు -------1/2 cup ఎండు మిర్చి ---------తగినంత ఉప్పు-----------------తగినంత చేయు విధానం:- ఎండు మిర్చిని ఒక స్పూన్ నూనెలో బంగారు రంగు వచ్చేలా వేపి ., చల్లారాక వెల్లుల్లి ఉప్పు వేసి పొడి కొట్టుకోవాలి.
కావలసినవి:- వేయించిన శెనగపప్పు ---------1cup వెల్లుల్లి రేకులు ---------------- ఒక చిన్న గడ్డ నుంచి తీసినవి కారం పొడి-------------------- ఒక స్పూన్ ఉప్పు------------------------తగినంత చేయు విధానం:- వెల్లులి రేకులకి పొట్టు తీసి అన్ని దినుసులను కలిపి పొడి కొట్టుకోవాలి.
కావలసినవి:- కూర పొడి దినుసులు కొత్తిమిర అమ్చూర్ పొడి ---కొద్దిగా ఉప్పు------------తగినంత చేయు విధానం:- 1)కొత్తిమిరను శుభ్రం చేసి కడిగి తరిగి పెట్టుకోవాలి. 2)న్యూస్ పేపర్ లేదా పొడి బట్ట మీద వేసి పెట్టాలి. 3)కూరపొడి దినుసులని వేయించి పెట్టుకోవాలి. 4)చెమ్మంతా పీల్చేసాక తడి లేదని నిర్ధారించుకున్నాక, కూర పొడి దినుసులతో మరియు ఉప్పు అమ్చూర్ పౌడర్ కలిపి పొడి చేసుకోవాలి.
కావలసినవి :- మినపప్పు----------------1 cup శనగపప్పు ---------------1 cup ఎండు మిరపకాయలు-----కొన్ని ఎండు కొబ్బరి కోరు--------2cups ఇంగువ------------------- కొద్దిగా ఉప్పు---------------------రుచికి తగినంత చేయు విధానం:- ఎండు కొబ్బరి కోరు తప్ప మిగతా అన్నింటినీ వేయించి పొడి కొట్టుకోవాలి. పచ్చి కొబ్బరి కోరు అయిన పక్షంలో కోరును ఎర్రగా వేయించుకోవాలి.
చేయు విధానం :- ఒక స్పూన్ నూనె లో విడి విడిగా బంగారు రంగు వచ్చేవరకూ వేయించి చల్లారక mixie లో బరకగా పొడి కొట్టుకోవాలి. ఈ పొడిని చట్నీ పొడి లాగ కూడా ఉపయోగించ వచ్చు.
కావలసినవి :-
ధనియాలు-------1 cup
మిరియాలు-------1/4cup
జీలకర్ర-----------1/4 cup
శెనగ పప్పు------1/4 cup
కండి పప్పు------1/4 cup
ఎండుమిరపకాయలు----4(optional) చేయు విధానం:-
1)ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఒక స్పూన్ నూనె లో అన్నింటిని బంగారు రంగు వచ్చేలా వేపుకోవాలి.
2)చల్లారాక పొడి కొట్టుకోవాలి. మెత్తగా లేకున్నా పరవాలేదు.
3)కొంతసేపు అయ్యాక గాలి చొరని డబ్బాలో తీసి పెట్టుకోవాలి. గమనిక:- రసం పొడికి మిరపకాయలు తప్ప, మిగతావి బాణలిలో వేపకుండా కూడా పొడి కొట్టుకోవచ్చు.
కావలసినవి:-
శనగ పప్పు ------------------- 1 cup
ధనియాలు -------------------- 2 cups
మెంతులు ---------------------- 1/4cup
ఎండు మిరపకాయలు ----------- తగినంత
జీలకర్ర -------------------------- 2 table spoons చేయు విధానము:-
1)ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, ఒక స్పూన్ నూనెలో, అన్నింటిని..బంగారు రంగు వచ్చే వరకూ వేయించి పెట్టుకోవాలి
2)చల్లారాక మెత్తగా పొడి కొట్టు కోవాలి
౩)కొంత సేపు తర్వాత గాలి చొరని డబ్బాలో వేసి పెట్టుకోవాలి