కావలసినవి:-
దోసకాయ -ఒకటి
ఆవాలు -1tbspoon
జీలకర్ర - 1tbspoon
ఎండు మిర్చి - 4 or 5
చింతపండు -నిమ్మకాయంత
మెంతులు -1/2 table spoon
ఇంగువ -కొద్దిగా
ఉప్పు -తగినంత
నూనె -2 to 3 tbspoons
కరివేపాకు రెమ్మలు -నాలుగు
కొత్తిమిర తరుగు - అలంకరించడానికి సరిపడా
చేయు విధానం:-
1.ముందుగా దొసకాయ తొక్క తీసి, ముక్కలుగా cut చేసి పెట్టుకోవాలి.
2.చింత పండుని నాన వేసి పెట్టుకోవాలి.
3.stove ON చేసి బాణలి పెట్టి కొద్ది నూనె వేసి వెచ్చ పడ్డాక ఎండుమిర్చి
మెంతులు వేసి ఎర్రగా వేపుకోవాలి.
4.చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలి.
5.ఇప్పుడు తరిగి ఉంచు కొన్న దోసకాయలో సగం తీసుకొని.. అందులో
చింతపండు గుజ్జు, ఉప్పు, వేపి ఉంచిన ఎండుమిర్చి,మెంతులు వేసి
mixie లో grind చేసుకోవాలి.(ఇష్టమైన వారు పచ్చిమిర్చి కూడా
వేసుకోవచ్చు.)
6.ఇప్పుడు ఈ నూరిన ముద్దని మిగిలిన దోసకాయ ముక్కలతో
కలుపుకోవాలి.
7.ఆవాలు, జీలకర్ర ,ఇంగువ కరివేపాకు లతో పోపు పెట్టుకోవాలి.
8.సన్నగా తరిగిన కొత్తిమిరతో అలంకరించుకోవాలి.
NOTE:- ఇదే విధంగా కీర దోసకాయతో కూడా చేసుకోవచ్చు. అందులో ఎండుమిర్చి బదులు పచ్చి మిర్చి వాడితే బాగుంటుంది.
No comments:
Post a Comment