కావలసినవి:-
టొమాటోలు -1/4 kg
కారంపొడి -1tb spoon
పసుపు -చిటికెడు
ఉప్పు -తగినంత
బెల్లం ముక్క -చిన్నది
తాలింపు గింజలు - పోపుకి సరిపడా
ఇంగువ - కొద్దిగా
కరివేపాకు - రెండు రెమ్మలు
నూనె - ఒక గరిటెడు
కొత్తిమిర -ఒక చిన్న కట్ట
చేయు విధానము:-
1.ముందుగా టొమాటోలను ముక్కలుగా తరిగి వుంచుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె పోయాలి. నూనె కాగాక తాలింపు గింజలు వేయాలి. ఆవాలు చిటపట లాడాక, తాలింపు గింజలు ఎర్రగా వేగాక,ఇంగువ,కరివేపాకు వేయాలి
2.ఇప్పుడు తరిగి ఉంచిన టొమాటో లను వేయాలి. అందులో ఉప్పు , పసుపు వేసి ఒక సారి బాగా కలిపి మూత మూసి పెట్టాలి.
3.మధ్య మధ్యలో తీస్తూ బాగా వాడ్చుకోవాలి.
4.చిన్న బెల్లం ముక్క పొడి చేసి వేయాలి.
5.టొమాటో లు బాగా వేగి దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసి సన్నగా తరిగిన కొత్తిమిర చల్లుకోవాలి.
ఈ పచ్చడి ఎక్కువ కారంగా చేయకూడదు. పిల్లలకి ఇష్టంగా వుంటుంది. దోసలకి బజ్జీలకి నంచుకోవటానికి బాగుంటుంది.