Sunday 21 April 2013

అరటికాయ కట్లెట్

కావలసినవి:-
అరటికాయలు పచ్చివి - 4
అల్లం వెల్లులి పేస్టు      - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిరపకాయలు   - 2
పుదినా ఆకులు         - గుప్పెడు
కొత్తిమిర                    - చిన్నకట్ట
కరివేపాకు                 - రెండు రెమ్మలు
బ్రెడ్ స్లైసులు              - 2 
బ్రెడ్ క్రంబ్స్                - తగినంత
కార్న్ ఫ్లోర్                 - రెండు టేబుల్ స్పూన్స్
పచ్చి శనగ పిండి       - రెండు టేబుల్ స్పూన్స్
మైదా                        - ఒక చిన్న గరిటెడు
ఉప్పు                       - తగినంత
ధనియాల పొడి         - రెండు టేబుల్ స్పూన్స్
కారం                       - రుచికి తగినంత
నూనె/వెన్న              -   షాలో ఫ్రై కి  సరిపడా

చేయు విధానము :-

1. ముందుగా అరటికాయలు తొక్క తీసి చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి.
2. కచ్చా పచ్చాగా మెదుపుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, తరిగిన పుదినా, తరిగిన కొత్తిమిర, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, చిన్నవిగా తుంపుకొన్న కరివేపాకు రెమ్మలు, కార్న్ ఫ్లోర్, శెనగపిండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొన్నా బ్రెడ్ స్లైసులు, ఉప్పు అన్ని వేసి బాగా కలుపుకోవాలి.

3. మైదా పిండిలో కొంచం నీళ్ళు పోసి గరిటజారుగా కలుపుకోవాలి
.


4. బ్రెడ్ క్రంబ్స్ ఒక ప్లేట్ లోకి తీసి పెట్టు కొవాలి.  








5. ఇప్పుడు కలిపి పెట్టుకొన్న మిశ్రమాన్ని కావాల్సిన ఆకారంలో మలుచుకొని ఒక ప్లేట్ లో పెట్టాలి .




6. కట్లెట్లను మైదా లో ముంచి తీసి బ్రెడ్ క్రంబ్స్ లో అద్ది.., వేడి చేసిన పెనం పై కొంచం నూనె లేక మైదా వేశాక దానిపై వెయాలి.
  
   7. అలాగే మిగతావి కూడా వేసి ఒకవైపు వేగాక రెండో వైపుకి తిప్పి మళ్ళీ కొంచం నూనె లేదా వెన్న వేసి వేగనివ్వాలి.

 8. ఇప్పుడు రెండో వైపు కూడా వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకొవాలి.
          
    9. రుచికరమైన అరటికాయ కట్లెట్లు సిద్దం .
                                                                                

Wednesday 23 March 2011

టొమాటో పచ్చడి రెండవ రకం

కావలసినవి:-
టొమాటోలు            -1/4 kg
కారంపొడి               -1tb spoon
పసుపు                 -చిటికెడు              
ఉప్పు                    -తగినంత 
బెల్లం ముక్క          -చిన్నది 
తాలింపు గింజలు    - పోపుకి సరిపడా 
ఇంగువ                 - కొద్దిగా 
కరివేపాకు             - రెండు రెమ్మలు 
నూనె                   - ఒక గరిటెడు 
కొత్తిమిర              -ఒక చిన్న కట్ట 

చేయు విధానము:-
1.ముందుగా టొమాటోలను ముక్కలుగా తరిగి వుంచుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె పోయాలి. నూనె కాగాక తాలింపు గింజలు                     వేయాలి. ఆవాలు చిటపట లాడాక, తాలింపు గింజలు ఎర్రగా  వేగాక,ఇంగువ,కరివేపాకు వేయాలి

2.ఇప్పుడు తరిగి ఉంచిన టొమాటో లను వేయాలి. అందులో ఉప్పు , పసుపు     వేసి ఒక సారి   బాగా కలిపి మూత మూసి పెట్టాలి.

3.మధ్య మధ్యలో తీస్తూ బాగా వాడ్చుకోవాలి.

4.చిన్న బెల్లం ముక్క పొడి చేసి వేయాలి.

5.టొమాటో లు బాగా వేగి దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసి సన్నగా తరిగిన కొత్తిమిర చల్లుకోవాలి.

ఈ పచ్చడి ఎక్కువ కారంగా  చేయకూడదు. పిల్లలకి ఇష్టంగా వుంటుంది. దోసలకి బజ్జీలకి నంచుకోవటానికి బాగుంటుంది.



Monday 14 March 2011

టొమాటో పచ్చడి మొదటి రకం

కావలసినవి:-
టొమాటోలు        -1/4kg
ఎండుమిర్చి        -4or5
పచ్చిమిర్చి         -2to3
చింతపండు         -నిమ్మకాయంత 
ఆవాలు               - 1tbspoon
జీలకర్ర                 - 1tbspoon
మెంతులు             -1/2tbspoon
ఉప్పు                   -తగినంత  
నూనె                    -2 గరిటలు 
కొత్తిమిర సన్నగా } - అలంకరించడానికి సరిపడా 
తరిగినది         



చేయు విధానం:-
1. ముందుగా టొమాటోలను ముక్కలు చేసి పెట్టుకోవాలి.
2.చింతపండుని నానా వేసి పెట్టుకోవాలి.
3. బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ,  
    మెంతులు,ఎండుమిర్చి వేసి వేపాలి.
4. ఇప్పుడు పచ్చిమిర్చి, టొమాటో లను  వేసి బాణలిని మూసి వుంచి, మధ్య
     మధ్య లో తిరగేస్తూ బాగా వాడ్చాలి.
5. తరువాత స్టవ్ ఆపేసి బాగా చల్లార నివ్వాలి.
6. చింతపండు గుజ్జు తీసుకోవాలి.
7. ఇప్పుడు చల్లారిన మిశ్రమం, చింతపండు గుజ్జు, ఉప్పు వేసుకొని mixie లో 
    grind చేసుకోవాలి.
8. కొత్తిమిర తరుగుతో అలంకరించుకొంటే టొమాటో పచ్చడి రెడీ.

NOTE:- కారాలు , ఉప్పు వంటివి వారి వారి రుచిని అనుసరించి వేసుకోవాలి. 
              కొద్దిగా చక్కర లేదా బెల్లం కలుపుకోవచ్చు. లేదంటే రెండు మూడు
               ఖర్జూరం పళ్ళు వేసి నూరితే  ఆ పులుపుకి light తియ్యదనంతో 
               రుచి variety గా వుంటుంది. ఇదంతా వారి వారి రుచులను బట్టి.

దోసకాయ పచ్చడి

కావలసినవి:-
దోసకాయ     -ఒకటి
ఆవాలు        -1tbspoon
జీలకర్ర         - 1tbspoon
ఎండు మిర్చి - 4 or 5
చింతపండు   -నిమ్మకాయంత 
మెంతులు     -1/2 table spoon
ఇంగువ        -కొద్దిగా 
ఉప్పు          -తగినంత
నూనె          -2 to 3 tbspoons
కరివేపాకు రెమ్మలు -నాలుగు 
కొత్తిమిర తరుగు     - అలంకరించడానికి సరిపడా 

చేయు విధానం:-
1.ముందుగా దొసకాయ తొక్క తీసి, ముక్కలుగా cut చేసి పెట్టుకోవాలి.
2.చింత పండుని నాన వేసి పెట్టుకోవాలి.
3.stove ON చేసి  బాణలి పెట్టి కొద్ది నూనె వేసి వెచ్చ పడ్డాక  ఎండుమిర్చి     
   మెంతులు వేసి ఎర్రగా వేపుకోవాలి.
4.చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలి.
5.ఇప్పుడు తరిగి ఉంచు కొన్న దోసకాయలో సగం తీసుకొని.. అందులో 
    చింతపండు గుజ్జు, ఉప్పు, వేపి ఉంచిన ఎండుమిర్చి,మెంతులు వేసి
    mixie లో grind చేసుకోవాలి.(ఇష్టమైన వారు పచ్చిమిర్చి కూడా    
    వేసుకోవచ్చు.)
6.ఇప్పుడు ఈ నూరిన ముద్దని మిగిలిన దోసకాయ ముక్కలతో 
    కలుపుకోవాలి. 
7.ఆవాలు, జీలకర్ర ,ఇంగువ కరివేపాకు లతో  పోపు పెట్టుకోవాలి. 
8.సన్నగా తరిగిన కొత్తిమిరతో అలంకరించుకోవాలి. 

NOTE:-  ఇదే విధంగా కీర దోసకాయతో కూడా చేసుకోవచ్చు. అందులో ఎండుమిర్చి బదులు పచ్చి మిర్చి వాడితే బాగుంటుంది.

    

Sunday 13 March 2011

నువ్వుల పొడి

కావలసినవి:-
నువ్వులు (నల్లవి)-1cup
ధనియాలు          - 1/4 cup
ఇంగువ               - కొద్దిగా 
ఎండుమిర్చి         - తగినంత 

చేయు  విధానం:-
1. మిరియాలు, ధనియాలు ఎండుమిర్చి తక్కువ సెగలో బాణలిలో బాగా వేయించాలి.
2.నువ్వులు బాణలి లో నూనె లేకుండా కమ్మటి వాసన వచ్చేలా వేయించాలి. ఆ వేడిమీదనే  ఇంగువ వేసి తిప్పి
   స్టవ్ ఆపేయాలి.
3.చల్లారాక పొడి కొట్టుకోవాలి.

అన్నప్పొడి

కావలసినవి :-
మినప్పప్పు   -1cup
శనగపప్పు     -1cup
కందిపప్పు     -1cup
పెసరపప్పు    -1cup
జీలకర్ర          -1/4cup
ఎండుమిర్చి   - కొద్దిగా 
ఇంగువ         -కొద్దిగా 
ఉప్పు           -కావలసినంత 

చేయు విధానం:-
1.ఇంగువ ఉప్పు తప్ప .. మిగతావన్నీ విడివిడిగా కమ్మగా వేపుకోవాలి. చివరి దినుసు వేపి దించే ముందుగా
   ఇంగువ వేసుకోవాలి. ఆ వేడికే ఇంగువ వేగిపోతుంది.           
2.ఇప్పుడు వేయించిన పప్పులు, మిర్చి ..చల్లారాక ఉప్పు వేసి మెత్తగా mixie లో వేసి grind చేసుకోవాలి.
   అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పొడి కలుపుకొని తింటే చాల రుచిగా వుంటుంది. 

Friday 19 November 2010

వెల్లులి పొడి( కారం )

కావలసినవి:-
వెల్లులి రేకులు -------1/2 cup
ఎండు మిర్చి ---------తగినంత
ఉప్పు-----------------తగినంత
చేయు విధానం:-
ఎండు మిర్చిని ఒక స్పూన్ నూనెలో బంగారు రంగు వచ్చేలా వేపి ., చల్లారాక వెల్లుల్లి ఉప్పు వేసి పొడి కొట్టుకోవాలి.