Sunday, 21 April 2013

అరటికాయ కట్లెట్

కావలసినవి:-
అరటికాయలు పచ్చివి - 4
అల్లం వెల్లులి పేస్టు      - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిరపకాయలు   - 2
పుదినా ఆకులు         - గుప్పెడు
కొత్తిమిర                    - చిన్నకట్ట
కరివేపాకు                 - రెండు రెమ్మలు
బ్రెడ్ స్లైసులు              - 2 
బ్రెడ్ క్రంబ్స్                - తగినంత
కార్న్ ఫ్లోర్                 - రెండు టేబుల్ స్పూన్స్
పచ్చి శనగ పిండి       - రెండు టేబుల్ స్పూన్స్
మైదా                        - ఒక చిన్న గరిటెడు
ఉప్పు                       - తగినంత
ధనియాల పొడి         - రెండు టేబుల్ స్పూన్స్
కారం                       - రుచికి తగినంత
నూనె/వెన్న              -   షాలో ఫ్రై కి  సరిపడా

చేయు విధానము :-

1. ముందుగా అరటికాయలు తొక్క తీసి చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి.
2. కచ్చా పచ్చాగా మెదుపుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, తరిగిన పుదినా, తరిగిన కొత్తిమిర, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, చిన్నవిగా తుంపుకొన్న కరివేపాకు రెమ్మలు, కార్న్ ఫ్లోర్, శెనగపిండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొన్నా బ్రెడ్ స్లైసులు, ఉప్పు అన్ని వేసి బాగా కలుపుకోవాలి.

3. మైదా పిండిలో కొంచం నీళ్ళు పోసి గరిటజారుగా కలుపుకోవాలి
.


4. బ్రెడ్ క్రంబ్స్ ఒక ప్లేట్ లోకి తీసి పెట్టు కొవాలి.  








5. ఇప్పుడు కలిపి పెట్టుకొన్న మిశ్రమాన్ని కావాల్సిన ఆకారంలో మలుచుకొని ఒక ప్లేట్ లో పెట్టాలి .




6. కట్లెట్లను మైదా లో ముంచి తీసి బ్రెడ్ క్రంబ్స్ లో అద్ది.., వేడి చేసిన పెనం పై కొంచం నూనె లేక మైదా వేశాక దానిపై వెయాలి.
  
   7. అలాగే మిగతావి కూడా వేసి ఒకవైపు వేగాక రెండో వైపుకి తిప్పి మళ్ళీ కొంచం నూనె లేదా వెన్న వేసి వేగనివ్వాలి.

 8. ఇప్పుడు రెండో వైపు కూడా వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకొవాలి.
          
    9. రుచికరమైన అరటికాయ కట్లెట్లు సిద్దం .